తొలి డోస్‌ తీసుకున్నా..కుంభమేళాకు ఎంట్రీ!  - uttarakhand hc allows vaccinated people to enter kumbh mela
close
Updated : 31/03/2021 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి డోస్‌ తీసుకున్నా..కుంభమేళాకు ఎంట్రీ! 

హరిద్వార్‌: వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్న యాత్రికులు సైతం హరిద్వార్‌లో నిర్వహించే కుంభమేళాకు వచ్చేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు అనుమతిచ్చింది. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో యాత్రికులు కరోనా ‌టెస్టు చేసుకొని రావాలని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే కుంభమేళా ఒక నెలపాటే జరగనుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి  తక్కువ సమయం ఉండటంతో టీకా తొలి డోస్‌ తీసుకున్నవారు సైతం కుంభమేళాకు రావొచ్చునని కోర్టు తాజాగా వెల్లడించింది. 

ఇదిలా ఉంటే..  భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచాలని కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. ఈ క్రమంలో రోజూ సుమారు 50 వేల కొవిడ్‌ టెస్టులు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ మేరకు పుణ్యస్నానాల సమయంలో భక్తులు తప్పనిసరిగా కరోనా నియమాలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 30 వరకు కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని