బిగ్‌ న్యూస్‌: మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత - big reveal motion poster shaakuntalam
close
Published : 02/01/2021 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బిగ్‌ న్యూస్‌: మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ‘జాను’ తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. లాక్‌డౌన్‌లో మిద్దెపై వ్యవసాయం చేస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉన్నారు. ఇటీవల ‘సామ్‌జామ్‌’ అంటూ ‘ఆహా’లో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారు.

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్‌ లవ్‌స్టోరీ ‘శాకుంతలం’. ఇందులో సమంత టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్లు  శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ‘శాకుంతలం’ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సమంత పేరు అధికారికంగా ప్రకటించారు. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.

పాన్‌ ఇండియా సినిమాగా ‘శాకుంతలం’ తెరకెక్కుతోంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి..!

ట్రైలర్‌లో కథ వెతక్కండి.. ఇంకాస్త ఆగండి!

ట్రెండింగ్‌లో టాలీవుడ్‌ హీరోలు
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని