close
అవీ.. ఇవీ..
టాప్‌ హ్యాష్‌ట్యాగ్‌..‘బిగిల్‌’ ఒక్కటే!

హైదరాబాద్‌: తమిళ కథానాయకుడు విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. ఈ ఏడాది అత్యధికంగా ట్వీట్‌ చేసిన టాప్‌ టెన్‌ హ్యాష్‌ట్యాగ్‌లను ట్విటర్‌ ఇండియా విడుదల చేసింది. ఇందులో సినీ రంగం నుంచి (భారత్‌) కేవలం ‘బిగిల్‌’ మాత్రం చోటు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది అత్యధికంగా హ్యష్‌ట్యాగ్‌లు పొందిన అంశాల్లో లోక్‌సభ ఎన్నికలు, చంద్రయాన్ 2, క్రికెట్‌ ప్రపంచకప్, పుల్వామా, ఆర్టికల్‌ 370, దీపావళి, అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌, అయోధ్య, ఈద్‌ముబారక్‌ వరుస క్రమంలో ఉన్నాయి. ‘బిగిల్‌’ ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో విజయ్‌ అభిమానులు సోషల్‌మీడియాలో సందడి చేస్తున్నారు. మరోసారి ‘బిగిల్‌’ హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఒక్క బాలీవుడ్‌ చిత్రం కూడా స్థానం దక్కించుకోలేకపోవడం గమనార్హం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.