దీపిక ఎందరికో ప్రేరణ: మాజీ ప్రపంచ సుందరి - deepika padukone inspiration to many says manushi chhillar
close
Published : 24/02/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపిక ఎందరికో ప్రేరణ: మాజీ ప్రపంచ సుందరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెలిచిన మానుషి చిల్లర్‌ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేయబోతోంది. ‘పృథ్వీరాజ్‌’ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జోడీగా ఆమె నటించింది. కాగా, దీపావళి కానుకగా నవంబర్‌ 5న ఆ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న దీపిక పదుకొణె కూడా 2007లో దీపావళికి ‘ఓం శాంతి ఓం’తో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించడంతో దీపికకు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే.. దీపిక బాటలోనే మానుషి నడుస్తోందన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించింది.

‘దీపిక ఎంతోమంది అమ్మాయిలకు ప్రేరణగా నిలిచే నటి. ఆమెలా నేను కూడా దీపావళికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్నతనంలో దీపావళికి విడుదలయ్యే సినిమాలను థియేటర్‌కు వెళ్లి చూసిన రోజులు నాకు గుర్తున్నాయి. తొలి సినిమా అని ఎక్కువగా అంచనాలు పెట్టుకొని ఒత్తిడి గురికాను. ఎందుకంటే నా మొదటి చిత్రాన్ని నేను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని ఆమె పేర్కొంది. కాగా.. ఈ చిత్రానికి చంద్ర ప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించారు. చారిత్రక నాటకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనూసూద్‌, సంజయ్‌దత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని