యువ కథానాయకుడు సందీప్ కిషన్ హాకీ ఆటగాడిగా మారారు. ఇప్పుడాయన నుంచి రానున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రం కోసం ఈ కొత్త అవతారమెత్తారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో దేశం తరఫున ఆడాలని కలలు కనే హాకీ క్రీడాకారుడిగా సందీప్.. అతని ప్రేయసిగా లావణ్య త్రిపాఠి దర్శనమిచ్చారు. ఇందులో లావణ్య హాకీ ప్లేయర్‌గానే కనిపించనుంది. మరి వీళ్లిద్దరూ హాకీ ఆడే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేంటి? వాటిని అధిగమించి దేశానికి ఎలా ప్రాతినిథ్యం వహించారు? అన్నది మిగతా చిత్ర కథ. ‘‘మన దేశంలో స్పోర్ట్స్‌మెన్‌కు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు సర్. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయ్యి చాలా కాలం అయిపోయింది. ఏ స్పోర్ట్స్ చూడాలో.. ఏది చూడకూడదో బిజినెస్మెన్ నిర్ణయిస్తున్నాడు’’ అంటూ ట్రైలర్లో సందీప్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
కొత్తగా మరొకటి..
సందీప్ కిషన్ కొత్తగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించారు. వేద వ్యాస్ దర్శకుడు. మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మంగళవారం విశాఖపట్టణంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్ క్లాప్ నివ్వగా.. కంకట్ల సిల్క్స్ మల్లిక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఓ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. సందీప్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: ఛోటా కె.ప్రసాద్.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ