నాయకా.. ఏమిటీ కెవ్వు కేక: జన్మదిన వేడుకల్లో అసభ్య నృత్యాలు
close
Updated : 05/08/2021 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాయకా.. ఏమిటీ కెవ్వు కేక: జన్మదిన వేడుకల్లో అసభ్య నృత్యాలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: దర్శి నియోజకవర్గంలో ఓ నాయకుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొందరు రెచ్చిపోయారు. పోలీసుల కళ్ల ముందే యథేచ్ఛగా అసభ్య నృత్యాలకు తెరతీశారు. ఈ నెల 2, 3 తేదీల్లో కురిచేడు, దొనకొండ మండలాల్లో జరిగిన ఈ కార్యక్రమాలు ఇప్పడు చర్చనీయాంశంగా మారాయి. వేడుకల సందర్భంగా పొరుగు జిల్లాకు చెందిన ఈవెంట్స్‌ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. పాట కచేరీలని పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత పొట్టి దుస్తులు ధరించిన నృత్యకారిణులు హల్‌చల్‌ చేశారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఈ తరహా కార్యక్రమాలపై నిషేధం అమలులో ఉంది. ఈ క్రమంలో కొందరు పాట కచేరీల పేరిట రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కొవిడ్‌ వైరస్‌ సైతం ప్రస్తుతం అన్నిచోట్లా వణికిస్తోంది. సాధారణ పెళ్లిళ్ల విషయంలోనూ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము 6 వరకు కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నాయి. ఇటువంటి సమయాల్లో బహిరంగ వేదికలపై అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఈ తరహా నృత్యాలు నిర్వహించడం చర్చకు తావిస్తోంది. కార్యక్రమాలను నిర్వహించింది అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు సైతం మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని