close
Published : 21/04/2021 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధర్మం తప్పినప్పుడే యుద్ధం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో లెఫ్టినెంట్‌ రామ్‌గా కనిపించనున్నాడు దుల్కర్‌. ‘శ్రీరాముడు, ప్రేమ కోసం ఆయన చేసిన యుద్ధం అజరామరం. అలాంటి మా లెఫ్టినెంట్‌ రామ్‌ ప్రేమని త్వరలోనే చూడబోతున్నారు’ అని పేర్కొంది నిర్మాణ సంస్థ.

దీనిపై స్పందిస్తూ ‘ప్రతిక్షణం ధర్మం.. ధర్మం తప్పినప్పుడే యుద్ధం’ అని రాసుకొచ్చారు దర్శకుడు హను. మరి ఈ రామ్‌ కథేంటి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. వైజయంతీ మూవీస్‌ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: దివాకర్‌ మణి, కళ: వైష్ణవి రెడ్డి. టైటిల్‌, నాయిక వివరాలు వెల్లడించలేదు.



Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని