Corona: 50వేల దిగువకు కరోనా కేసులు - india corona update
close
Updated : 22/06/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 50వేల దిగువకు కరోనా కేసులు

91 రోజుల కనిష్ఠానికి వైరస్ ఉద్ధృతి

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు తగ్గట్టే రోజురోజుకూ కొత్త కేసుల్లో క్షీణత కనిపిస్తోంది. తాజాగా 42,640 మందికి కరోనా సోకింది. సుమారు 91 రోజుల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. అటు కరోనా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గి ఏప్రిల్ 15నాటి దిగువకు చేరింది. తాజాగా 1,167 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 2,99,77,861కి చేరగా..  3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 6,62,521కి చేరింది. క్రియాశీల రేటు 2.35 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.36 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 81,839 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.89కోట్లకు చేరాయి. 

టీకా పంపిణీలో జూన్ 21 రికార్డు.. 

దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకా డోసులు అందజేసేలా.. సవరించిన మార్గదర్శకాలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దాంతో తొలిరోజే 86,16,373 మందికి టీకాలు వేశారు. ఈ ఏడాది జనవరి 16న దేశంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ ఒక్కరోజులో ఇంత అధిక స్థాయిలో డోసుల పంపిణీ జరగలేదు. నిన్న ఒక్కరోజే 16లక్షలకు పైగా టీకాలు వేసి, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 28,87,66,201 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని