close

తాజావార్తలు

‘భారత్‌’: ‘స్లో మోషన్‌’ పాట చూశారా..

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలోని ‘స్లో మోషన్‌’ అనే పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. పాటలో సల్మాన్‌ బైక్‌పై విన్యాసాలు చేయడం, దిశా పటానీ ఆక్రోబాట్స్‌ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. పాటలో దిశా చాలా అందంగా కనిపించారు. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటించారు. 
‘ప్రతి చిరునవ్వు ఎవ్వరూ చూడలేని ఓ బాధను దాస్తుంటుంది’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ‘భారత్‌’ అనే వ్యక్తి కథను తెరపై చూపించనున్నారు. రంజాన్‌ కానుకగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.