భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు
close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:17 IST

భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు

వైకే పొరాలో ముగ్గురు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో వైకే పొరాకు చెందిన ఫైదా హుస్సేన్‌ యాతో, ఉమర్‌ రంజాన్‌లు కాగా.. సోపాట్‌ దేవసర్‌కు చెందిన ఉమర్‌ రషీద్‌ బేగ్‌ ఉన్నట్టుగుర్తించినట్టు పోలీసులు తెలిపారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని