రూ.3 కోట్ల విలువైన వజ్రాలు చోరీ!

తాజా వార్తలు

Published : 20/01/2020 00:51 IST

రూ.3 కోట్ల విలువైన వజ్రాలు చోరీ!

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో రూ.3 కోట్ల విలువ చేసే వజ్రాలు చోరీకి గురయ్యాయి. మేనేజర్‌కు అప్పగించాల్సిన వజ్రాలను నమ్మకస్తులైన కార్మికులే ఎత్తుకెళ్లిపోయారని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. కత్రాంగాం పరిధిలోని పటేల్‌ ఫాలియాలోని డైమండ్‌ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు చాలా కాలంగా పని చేస్తున్నారు. అదే నమ్మకంతో 1200 క్యారెట్లకు పైగా ఉన్న 3 వజ్రాలను హెచ్‌వీకే సంస్థ మేనేజర్‌కు ఇవ్వాల్సిందిగా నిర్వాహకులు వారి చేతికిచ్చారు. అదే అదునుగా భావించిన సిబ్బంది.. వజ్రాలతో పరారయ్యారు. ఈ వజ్రాల ఖరీదు కనీసం రూ.3 కోట్లు ఉంటుందని యాజమాన్యం తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల అధారంగా గాలింపు చేపట్టారు.
 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని