close
Array ( ) 1

తాజా వార్తలు

కనురెప్పే కాటేసింది..!

ముగ్గురు బిడ్డలతో బావిలో దూకిన తల్లి

కమ్మవారిపల్లిలో విషాదం

మృతి చెందిన భార్గవి, నీటిలో గల్లంతైన భవ్య. భార్గవి (దాచిన చిత్రం)

పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం.. ఆడపిల్లలను సాకలేననే అనుమానం.. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా తగ్గని భారం.. చెరువు చూపిస్తానని బిడ్డలను బావిలో తోసేసిన కర్కశం.. దురదృష్టం వెన్నాడి.. తాను బతికి.. పిల్లల్ని పోగొట్టుకున్న దయనీయం.. ఏ తల్లికీ ఎన్నడూ రాకూడని కష్టం..


విషాదంలో తల్లి అరుణమ్మ

పుట్టపర్తి, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలకు కలత చెందింది. మనోవేదనతో ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకుందో తల్లి. ఈ హృదయ విదారక ఘటనలో తల్లి బతికి బయటపడగా.. ముగ్గురి బిడ్డల్లో ఒకరు విగతజీవిగా తేలగా, మరో ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. పుట్టపర్తి సమీపంలోని పెద్దకమ్మవారిపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది.. వివరాలిలా.. పెద్దకమ్మవారిపల్లి దొమ్మరికాలనీకి చెందిన గురుమూర్తి, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారై అరుణమ్మను కదిరికి చెందిన రమేష్‌కు ఇచ్చి 13 ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి భవ్య(8), భార్గవి(8) కవలలు, చందన(5) సంతానం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. ఆటో నడుపుకొంటూ రమేష్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో సంతోషంగా ఉండే కాపురంలో కలతలు రేగాయి. నాలుగు నెలల నుంచి భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు. ఈనేపథ్యంలో 20 రోజుల కిందట ఆమె కదిరి నుంచి పుట్టింటికి పిల్లలతో కలిసి వచ్చింది. కొంతకాలంగా కవలలైన భవ్య, భార్గవి తాతఅవ్వ గురుమూర్తి, రమణమ్మ వద్ద ఉంటూ పెద్దకమ్మవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుకుంటున్నారు. చిన్నారి చందన తల్లి వద్దే ఉండేది. ఆదివారం సాయంత్రం చెరువు చూసొద్దామని అరుణమ్మ ముగ్గురు పిల్లలను తీసుకెళ్లింది. అక్కడే ఉన్న బావిలో భవ్య, చందనలను ముందు తోసి, భార్గవితో కలిసి తానూ దూకేసింది. సమీపంలోని స్థానికులు వెంటనే బావిలోకి దిగి అరుణమ్మతో పాటు భార్గవిని బయటకు తీశారు. భార్గవిని సత్యసాయి జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, ఆ చిన్నారి అక్కడ తుదిశ్వాస విడిచింది. తల్లి అరుణమ్మ ప్రాణాలతో బయటపడింది. భవ్య, చందనల మృతదేహాల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా ఉండి, అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారుల మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామకృష్ణయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారుల మృతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.