close

తాజా వార్తలు

Published : 05/07/2020 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్యూటీపార్లర్‌లో అక్రమంగా ఐసోలేషన్‌ కేంద్రం!

బాధితుల నుంచి రోజుకి రూ.10 వేల వసూలు

జూబ్లీహిల్స్‌: ఓ బ్యూటీ పార్లర్‌ను కరోనా ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చిన గుట్టు రట్టయింది. వైరస్‌ సోకిన వారిని చేర్చుకుంటూ రోజుకు రూ.10 వేల అద్దె వసూలు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు.5లో కలర్స్‌ పేరుతో బ్యూటీ స్టూడియో ఉంది. ఇందులో ఎలాంటి అనుమతులు లేకుండా గత 15 రోజులుగా కరోనా బాధితులను చేర్చుకుంటున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జి వైద్యాధికారి అమీర్‌, జూబ్లీహిల్స్‌ ఎస్సై శేఖర్‌ శనివారం ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగుచూసింది. అప్పటికే అక్కడున్న మూడు జంటలను పోలీసులు బయటకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జూబ్లీహిల్స్‌ సీఐ సత్తయ్య తెలిపారు. బ్యూటీ స్టూడియో నిర్వాహకులపై చర్యలకు వైద్యారోగ్యశాఖ సన్నద్ధమవుతోంది.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని