AP news: సీలింగ్‌కు కన్నాలేసి దుకాణాల్లో చోరీ

తాజా వార్తలు

Published : 25/07/2021 12:04 IST

AP news: సీలింగ్‌కు కన్నాలేసి దుకాణాల్లో చోరీ

విజయవాడలో: విజయవాడ బందర్‌రోడ్డులో ఉన్న పెనమలూరు కూడలి వద్ద దొంగలు హల్‌చల్‌ చేశారు. కూడలిలోని నాలుగు దుకాణాల సీలింగ్‌లకు రంధ్రాలు వేసి చోరీకి పాల్పడ్డారు. రహదారికి ఆనుకునే ఉన్న దుకాణాల్లో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. మొబైల్‌, చెప్పులు, హార్డ్‌వేర్‌, కిరాణా దుకాణాల్లో దొంగతనం జరిగినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే క్లూస్‌ బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన దుకాణాలను పరిశీలించారు. చోరీకి గురైన వస్తువులు తదితరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని