close

ప్రధానాంశాలు

Published : 23/04/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు డ్రోన్లను కూల్చాం

మధ్యవర్తులను పంపండి.. తెలుస్తుంది
మరో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా పాలగూడెం, బొత్తలంక అటవీ ప్రాంతాల్లో ఈ నెల 19న పోలీసులు డ్రోన్లతో బాంబులు వేయగా.. రెండింటిని తాము కూల్చామని మావోయిస్టులు ప్రకటించారు. ‘సీపీఐ మావోయిస్టు దక్షిణ సబ్‌ జోనల్‌ బ్యూరో’ పేరున గురువారం ఈమేరకు లేఖ విడుదలైంది. ‘‘డ్రోన్‌ దాడులను(బాంబింగ్‌) బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ఆధారం లేని ఆరోపణలంటూ బుధవారం ఖండించారు. మధ్యవర్తులను పంపిస్తే వాస్తవం తెలుస్తుంది. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారు కె.విజయ్‌కుమార్‌, ఆపరేషన్స్‌ డీజీపీ(పీఎంవో) అశోక్‌ జునేజా, ఆపరేషన్స్‌ ఐజీ నళినీప్రభాత్‌ల దర్శకత్వంలో ఎన్‌ఐఏ చేసిన దాడి. డ్రోన్‌ దాడి జరిగిన ప్రాంతానికి విలేకర్లు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించాలి. పీఎల్‌జీఏ(పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) పడగొట్టిన రెండు డ్రోన్‌లను కూడా చూడవచ్చు’’ అని లేఖలో పేర్కొన్నారు. తాము కూల్చామని చెబుతున్న డ్రోన్‌ చిత్రాలను విడుదల చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన