రూ.466 కోట్లు ఎగ్గొట్టారు..
close

ప్రధానాంశాలు

Published : 22/06/2021 04:19 IST

రూ.466 కోట్లు ఎగ్గొట్టారు..

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై కేసులు
షేర్లు తనఖా ఉంచి రుణం..
హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకుల ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌ :  హైదరాబాద్‌లో ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ కార్వీపై సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. తమ వద్ద ఉన్న షేర్లను తనఖా ఉంచుకుని రుణాలివ్వాలంటూ దరఖాస్తు చేసుకుని తర్వాత అసలు, వడ్డీ చెల్లించకుండా మోసం చేసిందంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు కొద్దిరోజుల క్రితం పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. తమ బ్యాంక్‌లో షేర్లపై రుణం తీసుకుని రూ.329.16 కోట్లు తిరిగి చెల్లించలేదంటూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ అయ్యగారి పోలీసులకు తెలిపారు. ఇక ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో రుణం తీసుకుని రూ.137 కోట్లు ఎగవేశారంటూ ఆ బ్యాంక్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.జె.ఎన్‌ గుప్తా తెలిపారు. తమ వద్ద రూ.వేల కోట్ల విలువైన షేర్లున్నాయని, వీటిని తనఖా ఉంచుకుని రుణం ఇవ్వాలంటూ రెండేళ్ల క్రితం సంప్రదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి ఆధారంగా రూ.185 కోట్లు రుణం మంజూరు చేశామని, కొద్దినెలలు వాయిదాలు చెల్లించిన అనంతరం వదిలేశారని తెలిపారు. కార్వీ సంస్థ షేర్ల లావాదేవీలపై సెబీ నిషేధం విధించిన సమయానికి వారు రూ.137 కోట్లు బకాయిపడ్డారని వివరించారు. వీటిని చెల్లించాలని కోరగా స్పందించడం లేదని పోలీసులకు వివరించారు.

రిజర్వ్‌బ్యాంకుకు సెబీ నివేదికతో..
2019 సెప్టెంబరులో కార్వీ సంస్థపై ఫిర్యాదు రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేధం విధించింది. తన వినియోగదారుల షేర్లను కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ అక్రమంగా సొంత లాభానికి వాడుకుంటోందంటూ సెబీ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు నివేదిక సమర్పించింది. వందలకొద్దీ షేర్లు నకిలీవి ఉన్నాయంటూ నివేదికలో పేర్కొంది. దీంతో ఒక్కసారిగా కార్వీ సంస్థ బ్యాంకుల్లో తనఖా ఉంచిన షేర్ల లావాదేవీలు స్తంభించాయి. మరోవైపు తాము ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాలంటూ కార్వీ డైరెక్టర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికారులు తాఖీదులు పంపించారు. నెలలు గడుస్తున్నా పత్రాలు ఇవ్వలేదని, అప్పు రూ.329.16 కోట్లకు చేరిందని చెప్పినా సి.పార్థసారథి తదితరులు పట్టించుకోలేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అధికారులు పోలీసులకు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే రుణం ఎగవేయడంతో పాటు బ్యాంకును దారుణంగా వంచించారని, ప్రజల డబ్బుకు రక్షణగా ఉన్న తమపట్ల అనైతికంగా ప్రవర్తించినందుకు కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన