ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

ప్రధానాంశాలు

Published : 19/10/2021 04:32 IST

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

డ్రైవర్లతో పాటు 26 మంది ప్రయాణికులు సురక్షితం

లింగాలఘనపురం, న్యూస్‌టుడే: జనగామ జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పూర్‌ నుంచి 26 మంది ప్రయాణికులతో కృష్ణా ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ వెళ్తోంది. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున 5.20 గంటలకు జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల శివారులో ఇంజిన్‌లో తలెత్తిన సమస్యతో పొగలు రావడం మొదలైంది. డ్రైవర్‌ రమేశ్‌కుమార్‌ గమనించి వెంటనే బస్సును నిలిపివేశాడు. తోటి డ్రైవర్‌ అఫ్జల్‌ అహ్మద్‌తో కలిసి ప్రయాణికులందర్నీ కిందకు దింపేశారు. చూస్తుండగానే మంటలు, పొగ బస్సును కమ్మేశాయి. అగ్నిమాపక దళం చేరుకుని మంటలను ఆర్పేలోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇద్దరు డ్రైవర్లు, ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను పోలీసులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు పంపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన