కరోనా కట్టడికే కఠిన చర్యలు: ఎస్పీ
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కట్టడికే కఠిన చర్యలు: ఎస్పీ


గరికపాడు చెక్‌ పోస్టు వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేయడం కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సరిహద్దుల్లోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ఫ్యూని పటిష్ఠంగా అమలు చేసేందుకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కేవలం అత్యవసర సరకులు, సేవలు మినహా ఇతర వాహనాలను అనుమతించేది లేదని, ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. బుధవారం మొదటి రోజు కావడంతో నిబంధనలు తెలియక వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తే తిరిగి పంపామని, గురువారానికి ఆ తాకిడి చాలా వరకూ తగ్గిందని అన్నారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు ఆయనకు పరిస్థితిని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని