అక్షర వెలుగు సమన్వయకర్త ఉద్యోగాలకు ముఖాముఖి
eenadu telugu news
Published : 27/07/2021 05:08 IST

అక్షర వెలుగు సమన్వయకర్త ఉద్యోగాలకు ముఖాముఖి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: అక్షర వెలుగు ప్రాజెక్టులో పని చేసేందుకు జిల్లా సమన్వయకర్త ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర సమన్వయకర్త చాట్ల మహేష్‌ తెలిపారు. 20 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి డిగ్రీ విద్యార్హత, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాలకు మినహా మిగతా 11 జిల్లాలకు జిల్లా సమన్వయకర్త ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 28న గుంటూరులోని ఆలా ఆసుపత్రి వెనుక ఉన్న తన్విక ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే ముఖాముఖికి తమ అర్హత పత్రాలు ఒరిజినల్‌, నకళ్లతోసహా హాజరు కావాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని