వాహన కాలుష్యం అరికట్టేందుకు నిరంతర తనిఖీలు
eenadu telugu news
Published : 01/08/2021 02:43 IST

వాహన కాలుష్యం అరికట్టేందుకు నిరంతర తనిఖీలు

వాహనాలకు కాలుష్య తనిఖీ పరీక్షలు నిర్వహిస్తున్న డీటీసీ మీరాప్రసాద్‌

పట్టాభిపురం, న్యూస్‌టుడే: వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని గుంటూరు ఉప రవాణాశాఖ కమిషనర్‌ మీరాప్రసాద్‌ వెల్లడించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం ట్రావెలర్స్‌ బంగ్లా వద్ద వాహన కాలుష్య తనిఖీ పరీక్షలు నిర్వహించారు. వాహనాల ద్వారా పరిమితికి మించి విడుదలయ్యే హానికరమైన కార్బన్‌ డై ఆక్సైడ్‌, సల్పర్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, హైడ్రోకార్బన్స్‌ తదితరాల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి ఓజోన్‌ పొర దెబ్బతిని ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఇప్పటికే దేశంలో 132 నగరాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. వాటిలో గుంటూరు కూడా ఉండటం విచారకరం. కాలుష్యం తగ్గించేందుకు ఇప్పటికే బీఎస్‌6 స్టాండర్డ్స్‌ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. జీరో పొల్యూషన్‌ ఉండే ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. పలువురు ఎంవీఐలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని