కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు
eenadu telugu news
Published : 01/08/2021 02:57 IST

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

మచిలీపట్నం క్రైం : ప్రజల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ఆదేశాలు జారీ చేశారు. గంపలగూడెం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్‌వీ రామకృష్ణ ఆ ప్రాంత మహిళా వీఆర్వో, ఆమె తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విచారణ నిర్వహించి అభియోగాలు వాస్తవమే అని నిర్ధారణ కావడంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తూ అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని