మందు.. చిందు ఘటనలో సీఐ సస్పెన్షన్‌
eenadu telugu news
Published : 05/08/2021 06:34 IST

మందు.. చిందు ఘటనలో సీఐ సస్పెన్షన్‌

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : సీసీఎస్‌ సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. గుంటూరు లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన ఓ పుట్టిన రోజు పార్టీలో పాల్గొన్న వాళ్లు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేని అటువంటి వేడుకల్లో మహిళలు నృత్యాలు చేయడం, పలువురు మద్యం తాగుతూ చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఆ వేడుకల్లో గుంటూరు సీసీఎస్‌లో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నాడనే ఆరోపణలు రావడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ త్రివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని