మలేషియా టెక్నాలజీతో రహదారి నిర్మాణం
eenadu telugu news
Published : 18/09/2021 03:26 IST

మలేషియా టెక్నాలజీతో రహదారి నిర్మాణం


రహదారిని పరిశీలిస్తున్న ఇరవై రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు

చల్లపల్లి, న్యూస్‌టుడే : నల్లరేగడి నేలల్లో నిర్మించే గ్రామీణ రహదారుల మన్నిక పెరిగేందుకు జియో సింథటిక్‌ మ్యాట్‌ టెక్నాలజీ ద్వారా నిర్మించిన రహదారిని 20 రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, చీఫ్‌ ఇంజినీర్లు, సీఎస్‌లు 38 మందితో కూడిన బృందం పరిశీలించింది. కృష్ణానది కరకట్ట వద్ద నుంచి చల్లపల్లి మండలం నిమ్మగడ్డ నుంచి ఘంటసాల మండలం దేవరకోట వరకు ప్రధాన మంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన నిధులు రూ.13.5 కోట్లతో 9.5 కిలోమీటర్ల పొడవున రెండు వరుసల రహదారిని నిర్మించారు. ఈ బృందం శుక్రవారం సాయంత్రం రహదారిని పరిశీలించింది. మలేషియాలో వినియోగించే జియో సింథటిక్‌ మ్యాట్‌ టెక్నాలజీని ఐఎస్‌వో 17025 ప్రమాణాలతో పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఈ రహదారి నిర్మించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ యర్రాస్వామి, ఈఈ రమణరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని