ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కాపాడుకోవాలి
eenadu telugu news
Published : 18/09/2021 04:16 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కాపాడుకోవాలి


మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

బ్రాడీపేట, న్యూస్‌టుడే: ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 2006 నుంచి నియామకాలు చేపట్టకపోగా.. వాటికి ఎయిడ్‌ని రద్దు చేస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం చేసే సందర్భంలో పోస్టులతో సహ విలీనం చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని, అన్ని రకాల ఖాళీలను చూపించాలని కోరారు. ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గర మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో నియమించాలన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను విలీనం సందర్భంగా ఉపాధ్యాయులకు పాత సదుపాయాలను కొనసాగిస్తూనే పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, ఇహెచ్‌ఎస్‌ సౌకర్యాలు కల్పించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాదర్‌, నాయకులు హనుమంతరావు, రాజశేఖర్‌, ఎస్‌.వి.జగదీష్‌కుమార్‌, వెంకటేశ్వరరావు, నారాయణ, వెంకటేశ్వర్లు, పోలయ్య, షకీల బేగం, వివిధ ప్రాంతాల ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని