పోక్సో యాక్టు కేసు నమోదు
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

పోక్సో యాక్టు కేసు నమోదు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : పదో తరగతి చదువుతున్న ఓ బాలిక(15)కు మాయమాటలు చెప్పి, విజయవాడ నుంచి భద్రాచలర తీసుకెళ్లిన జి.ఆనంద్‌ అనే యువకుడుపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అజిత్‌సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతంలో నివాసముంటున్న బాలికను ఆనంద్‌ అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. ఈ నెల 21వ తేదీన ఇంట్లోంచి బయటకు వచ్చిన బాలికకు, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దలకు తెలియకుండా భద్రాచలంలో పెళ్లి చేసుకుందామని తీసుకెళ్లాడు. అక్కడ మూడు రోజులు ఉన్న తర్వాత, పెళ్లి చేసుకోకుండా తిరిగి శనివారం అజిత్‌సింగ్‌నగర్‌లో దింపి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. ఘటనపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని