రాష్ట్రంలో దోపిడీ పాలన : దేవినేని ఉమా
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

రాష్ట్రంలో దోపిడీ పాలన : దేవినేని ఉమా


నాయకులతో కలిసి మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రాష్ట్రలో దోపిడీ పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆదివారం రెడ్డిగూడెం తెదేపా కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. భూతులు తిట్టడానికి మంత్రి పదవులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఇచ్చే బియ్యం అక్రమ సంపాదనకు మూల వనరుగా మార్చి వేశారన్నారు. ఇతర దేశాలకు బియ్యం తరలిపోతున్నాయని ఆరోపించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అరికట్టే ధైర్యం పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి లేదన్నారు. డ్వాక్రా మహిళల నుంచి రూ.30, రూ.50 వసూలు చేస్తున్నారని, ఇవి ఎవరికోసమో తెలపాలని డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వ 29 నెలల పాలనలో జిల్లాలో 27 ఇళ్లు మాత్రమే నిర్మాణం చేశారని దేవినేని ఎద్దేవా చేశారు. తెదేపా నాయకులు కె.విజయబాబు, వి.అంజిరెడ్డి, ఎం.నాగేశ్వరరెడ్డి, పి.కిరణ్‌కుమార్‌రెడ్డి, పి.పిచ్చిరెడ్డి, సీహెచ్‌.చందా తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని