తితిదే పాలనపై దేవాదాయ శాఖ అధ్యయనం 
eenadu telugu news
Updated : 19/10/2021 06:01 IST

తితిదే పాలనపై దేవాదాయ శాఖ అధ్యయనం 

తిరుపతి(తితిదే): తితిదేలో అమలు చేస్తున్న పరిపాలన అంశాలను అధ్యయనం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అమలు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు రెండో విడత ఆ శాఖ అధికారులు సోమవారం తితిదే జేఈవో సదా భార్గవితో సమావేశమయ్యారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో జేఈవో అధ్యక్షత సమావేశమై పలు అంశాలను తెలుసుకున్నారు. వీరికి ఈ నెల 22వ తేదీ వరకు శ్వేత భవనంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా తితిదేలో ఆడిటింగ్‌, అకౌంటింగ్‌, హుండీ కానుకల లెక్కింపు, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, అన్నదానం, ప్రసాదాల తయారీ, వంటశాలల ఆధునికీకరణ, ఆదాయ మార్గాలు మెరుగుపర్చడం, టికెట్ల జారీ విధానం, ఐటీ, టెండర్ల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. సమావేశంలో దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ సురేష్‌బాబు, ఈఈ మురళీ బాలకృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు, అసిస్టెంట్‌ కమిషనర్లు రామాంజనేయులు, రమేష్‌, లీలాకుమార్‌, ఏకాంబరం, తితిదే అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని