21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రతిపాదన
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రతిపాదన

కాకినాడ నగరం: ఎన్నికలు జరగని ఎంపీటీసీ స్థానాల వివరాలు పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జడ్పీ కార్యాలయం నుంచి 21 స్థానాల వివరాలతో నివేదికను ఎస్‌ఈసీకి పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికలకు ముందే 5 చోట్ల గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి మృతి చెందటంతో ఎన్నికలు ఆపేశారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసి ఫలితాలు వచ్చేసరికి మరో ముగ్గురు మృతి చెందారు. (వీరు గెలుపొందారు). ఏకగ్రీవంగా నిలిచిన మరో అభ్యర్థి సైతం చనిపోయారు. మరోవైపు ఎటపాక ఎంపీపీ పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 26తో ముగిసింది. దాంతో ఆ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని