వెబ్‌కాస్టింగ్‌ సాయంతో అనుక్షణం పర్యవేక్షణ
eenadu telugu news
Published : 20/09/2021 02:37 IST

వెబ్‌కాస్టింగ్‌ సాయంతో అనుక్షణం పర్యవేక్షణ


పుల్లడిగుంట లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించి వస్తున్న

కలెక్టరు వివేక్‌ యాదవ్‌ తదితరులు

గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కంట్రోల్‌ రూం నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పర్యవేక్షించారు. ఆదివారం ఉదయాన్నే పుల్లడిగుంటలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు, బారికేడ్లు అమర్చిన విధానం, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నారా.. లేదా? లెక్కింపునకు టేబుళ్ల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించి అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంకు వచ్చారు. ఇటీవల వర్షాలతో పలుచోట్ల బ్యాలెట్‌ బాక్సుల్లోకి నీరు చేరి తడిసిన బ్యాలెట్‌ పత్రాలు దర్శనమివ్వడం వంటి అంశాలపై కలెక్టర్‌ వెంటనే అధికారులకు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందికి ఏమైనా సందేహాలుంటే.. వారితో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సలహాలు అందించారు.

మీడియా కథనాలపై అప్రమత్తత: ఓట్ల లెక్కింపు కేంద్రంలో తాజా సమాచారం సామాజిక మాధ్యమాల్లో వస్తే.. వాటిని అధికార యంత్రాంగం పరిశీలించి ఆయా విభాగానికి చెందిన అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కొల్లూరులో బ్యాలెట్‌ పత్రాలు తడిసిపోయాయని వచ్చిన కథనంపై యంత్రాంగం అప్రమత్తమై సంబంధిత లెక్కింపు కేంద్రం అధికారులతో చర్చించి వారికి సూచనలు అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని