పిడుగుపాటుకు వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కర్లపాలెం, న్యూస్‌టుడే : విద్యుత్తు తీగలపై పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్లపాలెం మండల పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదపులుగువారిపాలేనికి చెందిన అక్కల శ్రీనివాసరెడ్డి (50) పొలానికి వెళ్లిన గేదెలు తోలుకొచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో పక్కనే ఉన్న విద్యుత్తు తీగలపై పిడుగు పడింది. తీగలు తగిలి శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని