పర్యాటక దినోత్సవం.. విద్యార్థులకు పోటీలు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 24/09/2021 00:45 IST

పర్యాటక దినోత్సవం.. విద్యార్థులకు పోటీలు: కలెక్టర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఈనెల 27న ఘనంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కార్యాలయం నుంచి గుగూల్‌ మీట్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు శుక్ర,శనివారం చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించాలని సూచించారు. విజేతలకు పర్యాటక దినోత్సవం రోజున బహుమతులు అందజేసేలా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో ఉరేగింపు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమాధికారి హన్మంత్‌రావు, డీఆర్‌డీవో, డీఎఫ్‌వో శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని