పలువురు ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

పలువురు ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

అవార్డు పొందిన ఉపాధ్యాయులు వీరే

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లో సోమవారం లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘అబ్దుల్‌ కలాం బెస్ట్‌ టీచర్స్‌ అవార్డు’ను జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు హర్యానా గవర్నర్‌ బండారి దత్తాత్రేయ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగంలో విశేష సేవలందించిన వారిని నిర్వాహకులు ఎంపిక చేశారు. సమగ్ర శిక్ష గుణాత్మక విద్య జిల్లా సమన్వయకర్త జగదీశ్వర్‌, మంథని మండలం ఆరెంద జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు కానుగంటి శ్రీనివాస్‌, ప్రైవేటు పాఠశాలల విభాగంలో బండి చంద్రమౌళి, ఆశాలత, రమాదేవి, కేఎస్‌ నందు, కన్నూరి లక్ష్మన్‌రావులు అవార్డు పొందారు. లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు సుదర్శనాచార్య, లీడ్‌ ఇండియా ప్రముఖులు పుల్లెల గోపిచంద్‌, పాపిరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని