close

శనివారం, ఆగస్టు 15, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విధుల్లో నిర్లక్ష్యం వీడండి

● ఈ-పంట నమోదుపై దృష్టి అవసరం

● జేసీ రవి పట్టన్‌శెట్టి


వీడియో సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షిస్తున్న జేసీ రవి పట్టన్‌శెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తహసీల్దార్ల ఏమరుపాటుతో ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ జరిగిపోతుందని జేసీ రవి పట్టన్‌శెట్టి అన్నారు. చాగలమర్రి, రుద్రవరం, ఆత్మకూరు, గూడూరు, శిరువెళ్ల, ఆదోని, కౌతాళం, పత్తికొండ మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని, జిల్లావ్యాప్తంగా 672 వరకు ఆటోమేటిక్‌గా డీమ్డ్‌ మ్యుటేషన్‌లోకి వెళ్లాయని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం తగదని, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. కలెక్టరేట్‌ నుంచి ఆయన సోమవారం డీఆర్వో పుల్లయ్య, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, కేఆర్‌ఆర్‌సీ ఉప కలెక్టర్‌ శ్రీనివాస్‌తో కలిసి రెవెన్యూ, పౌరసరఫరాల, వ్యవసాయ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గూడూరు, ఆత్మకూరు, జూపాడుబంగ్లా, పత్తికొండ, గోనెగండ్ల, తుగ్గలి మండలాల్లో అత్యధికంగా మ్యుటేషన్లను తిరస్కరిస్తున్నారని, జిల్లావ్యాప్తంగా 305 తిరస్కరణకు గురయ్యాయన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సంయుక్తంగా ఈ-పంట నమోదు చేపట్టాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకుల లాగిన్‌ తెరుచుకుంటుందని, వీఆర్వో లాగిన్‌ ఓపెన్‌ కావడం లేదని కొందరు తహసీల్దార్లు జేసీ దృష్టికి తెచ్చారు. గత నెల 27 నుంచి మీసేవా డ్యాష్‌ బోర్డు తెరుచుకోవడం లేదని, ఫలితంగా తమ పరిధిలో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా ఉందని నంద్యాల ఆర్డీవో జేసీకి విన్నవించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు సంబంధించిన గ్రీవెన్స్‌పై ప్రతి రోజూ 15 నిమిషాలు ప్రత్యేక దృష్టి పెడితే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రజల నుంచి నేరుగా ఎవరూ ఫిర్యాదులు స్వీకరించవద్దని, తమతమ కార్యాలయాల వద్ద ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. ఆగ్రోస్‌ జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వరరెడ్డి, డీఎస్‌వో పద్మశ్రీ, పౌరసరఫరాల డీఎం షర్మిల, ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, పట్టు పరిశ్రమ శాఖ డీడీ వాణి పాల్గొన్నారు.

మొదటి రోజు మొరాయించిన సర్వర్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఈ-పంట నమోదు కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పంటల నమోదు చేపట్టాల్సి ఉంది. మొదటిరోజే సర్వర్‌ మొరాయించడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఈ -పంట నమోదులో భాగంగా ముందుగా వీఆర్వోలు తమ లాగిన్‌లో భూముల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలి. వీఏఏలు తమ లాగిన్‌లో క్రాప్‌ డేటాను అప్‌లోడ్‌ చేసుకోవాలి. కాగా ఎన్‌ఐసీ సర్వర్‌ సాంకేతిక సమస్యతో కేవలం 300 మంది మాత్రమే లాగిన్‌ అయ్యారు. ఈ-పంట నమోదుపై జేసీ రవి పట్టన్‌శెట్టి, డీఆర్వో పుల్లయ్య, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి ఇకనుంచి ప్రతి రోజు పర్యవేక్షించనున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.