Published : 05/12/2020 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజావ్యతిరేక వైద్య విధానాలపై నిరసన


నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా వైద్యులు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆధునిక వైద్యంలోని 58 రకాల శస్త్రచికిత్సలు చేయడానికి ఆయుర్వేద వైద్యులకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డా.రవికృష్ణ, డా.అనిల్‌కుమార్‌ డిమాండు చేశారు. స్థానిక మధుమణి నర్సింగ్‌ హోం హాల్‌లో మహిళా వైద్యులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 11న అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలు నిలిపి వేసి సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగమణి, జ్యోతి, వాణి, లక్ష్మీసౌజన్య అరుణకుమారి, నర్మద, మల్లీశ్వరి, సుష్మా, హరిత, లలిత, ధనలక్ష్మి, శిల్పా, సింధూ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని