నిరంతర సాధన.. అత్యుత్తమ ప్రదర్శన
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

నిరంతర సాధన.. అత్యుత్తమ ప్రదర్శన

తిప్పర్తి, నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

హ్యాండ్‌బాల్‌ క్రీడలో తిప్పర్తి మండల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీల్లో సత్తా చాటారు. జిల్లా జట్టులో ఉత్తమ ప్రదర్శన ద్వారా కొందరు రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వడం విశేషం. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చదువుతోపాటు ఆయా క్రీడలపై సాధన చేసే అవకాశం లభించింది. శిక్షకుడు అక్బర్‌ పర్యవేక్షణలో వీరు సాధన చేస్తున్నారు. ఇతర క్రీడలతో పోలిస్తే భిన్నంగా ఉండే హ్యాండ్‌బాల్‌ క్రీడలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు.


 

హ్యాండ్‌బాల్‌లో మారగోని మహేశ్‌గౌడ్‌ ప్రతిభ

సిద్దిపేట జిల్లా మద్దూర్‌లో 2016లో జరిగిన అండర్‌-12 విభాగంలో హ్యాండ్‌బాల్‌ క్రీడలో జిల్లా జట్టు తరఫున పాల్గొన్నాడు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. జనగామలో 2020లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో అండర్‌-17 విభాగంలో నల్గొండ జిల్లా జట్టు తరఫున పాల్గొన్నాడు. హైదరాబాద్‌ జింఖానా మైదానంలో 2020లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో అండర్‌-19 విభాగంలో నల్గొండ జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. హనుమకొండలో 2019లో జరిగిన సబ్‌జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో నల్గొండ జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. ఈ క్రీడల్లో కాంస్య పతకం సాధించాడు. త్వరలో జరగనున్న క్రీడల్లో పాల్గొనేందుకు నిత్యం సాధన చేస్తున్నాడు.


రోజుకు రెండు గంటల సాధనలో గోగికార్‌ సన్నీ

జనగామలో 2020లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో అండర్‌-17 విభాగంలో నల్గొండ జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. హైదరాబాద్‌ జింఖానా క్రీడా మైదానంలో 2020లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో అండర్‌-19 విభాగంలో నల్గొండ జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. కరోనా కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో రోజుకు రెండు గంటలపాటు కోచ్‌ పర్యవేక్షణలో హ్యాండ్‌బాల్‌ క్రీడలో సాధన చేశాడు. ప్రస్తుతం ఆటపై దృష్టి పెట్టాడు.


పతకాలే లక్ష్యంగా సాధన

ఎండీ అక్బర్‌, శిక్షకుడు

హ్యాండ్‌బాల్‌, సిలబం, తదితర క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాను. వారికి సలహాలు, సూచనలు అందిస్తున్నా. బంగారు పతకాన్ని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ప్రతిభను గుర్తించి వారికి ఇష్టమైన ఆటల్లో రాణించేలా దోహదపడుతున్నా.


రాష్ట్ర జట్టుకు ఎంపికైన సిరసవాడ శివకుమార్‌

జగిత్యాల జిల్లా వెల్గటూరులో 2015లో జరిగిన సబ్‌జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో అండర్‌-15 విభాగంలో నల్గొండ జిల్లా జట్టు తరపున పాల్గొన్నాడు. అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. జార్కండ్‌లో 2016లో జరిగిన సబ్‌జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో అండర్‌-15 విభాగంలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొన్నాడు. కర్నూలు జిల్లాలో 2019లో జరిగిన హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో సౌత్‌జోన్‌ యూనివర్సిటీ తరపున పాల్గొన్నాడు. భవిష్యత్తులో నిర్వహించనున్న టోర్నమెంట్‌ల కోసం నిరంతరం సాధన చేస్తున్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని