జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి కృషి
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ఏవీ రంగనాథ్‌

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం న్యాయసేవా అధికార సంస్థ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠినంగా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. మత్తు పదార్థాల వల్ల దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మత్తు పదార్థాల విక్రయాలతో తలెత్తే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యల గురించి విక్రయదారులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దు విశాఖ మన్యం ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీసు సిబ్బందిని అభినందించారు. కేసుల నమోదు, విచారణ, పాటించాల్సిన నిబంధనలు, కోర్టులో సమర్పించాల్సిన పత్రాలు, ఇతర అంశాలపై జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి వేణు పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీష్‌ చోడగిరి, అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, రమణారెడ్డి, సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని