ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
eenadu telugu news
Published : 26/10/2021 05:16 IST

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం


నల్గొండలో పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 58 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 15,535 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1281 మంది గైర్హాజరయ్యారు. నల్గొండలో పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో దస్రునాయక్‌, డీఈసీ సభ్యులు నరేంద్రకుమార్‌, భానునాయక్‌, ఇస్మాయిల్‌ పర్యవేక్షించారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు పరీక్షకు గంటకు ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి కేంద్రంలో కొవిడ్‌ నిబంధనలు పక్కాగా అమలు చేశారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత చూశాకే లోపలికి అనుమతించారు. ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించి పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్ష నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు, బస్టాండ్‌ల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి కనిపించింది.

నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఐఈవో పర్యవేక్షణ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని