close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్బీకేలతో రైతులకు లబ్ధి

స్టాళ్లను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డి,

కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎమ్మెల్యే కాకాణి

మనుబోలు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలతో(ఆర్బీకే) రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి వై.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రూ.60 కోట్లతో రైతులకు సహకార సంఘాల ద్వారా ఎరువులు అందే ఏర్పాటుచేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డితో కలసి వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లని సందర్శించారు. పంట సాగు హక్కు పత్రం పోస్టర్‌, పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను ఆవిష్కరించారు. రైతులకు యూరియా, పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ కోదండరామిరెడ్డి, ఆదర్శ రైతులను సన్మానం చేశారు. కార్యక్రమంలో జేడీఏ ఆనందకుమారి, పశుసంవర్థకశాఖ జేడీ విజయమోహన్‌, మత్స్య శాఖ జేడీ శ్రీహరి, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగం బలోపేతానికి కృషి: కలెక్టరు

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు పేర్కొన్నారు. మనుబోలులో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 660 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయన్నారు. రైతు భరోసా పథకంలో రెండు లక్షల మంది రూ.150 కోట్లు లబ్ధి పొందారన్నారు. జిల్లాలో క్లస్టర్‌ ఏర్పాటు చేసి ప్రాసెసింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ ప్యాకింగ్‌ మొదలైన వాటిని ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తహసీల్దారు కార్యాలయంలో రైతు దినోత్సవంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

శుభకార్యానికి వెళుతూ మృత్యుఒడికి..

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రి వద్ద జరిగింది. బుజబుజనెల్లూరు వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న సిద్ధవరపు హరిబాబు(50), జగదేవిపేటకు చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. వీరిద్దరూ గురువారం చిత్తూరు జిల్లాలో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జగదేవిపేట నుంచి బయల్దేరిన ద్విచక్ర వాహనం మెడికవర్‌ ఆసుపత్రి వద్దకు రాగానే ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న హరిబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రధానాంశాలు

రూ.2 రోగాలు మెండు

జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌(బీఐఎస్‌) అనుమతి పొందిన తాగునీటి ప్యాకెట్ల తయారీ కేంద్రాలు నాలుగు మాత్రమే ఉండగా- అవి లేకుండా మరో 100 కేంద్రాల్లో తాగునీటి ప్యాకెట్ల తయారీ జరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఒకసారి బీఐఎస్‌ ధ్రువపత్రం పొందిన తర్వాత.. ఏటా దాన్ని పునరుద్ధరించుకోవాలి. అధికారులు ఏటా ఆయా ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి.. ప్రమాణాలు పాటించిన వాటికే అనుమతులు ఇవ్వాలి. కానీ, అధిక శాతం ప్లాంట్ల నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండానే తమ పని కానిచ్చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఆహార తనిఖీశాఖ, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు, కొలతల శాఖలు సంయుక్తంగా పరిశీలన చేపట్టి అనుమతుల్లేని, ప్రమాణాలు పాటించని తాగునీటి ప్యాకెట్ల తయారీ కేంద్రాలను మూయించాల్సి ఉన్నా..

ఆసుపత్రిలో అరగంటలో చేర్చుకోవాల్సిందే...

నెల్లూరు(వైద్యం), కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల వేగాన్ని పెంచాలని, ర్యాపిడ్‌ టెస్టుల ఫలితాలు అరగంటలో, ట్రూనాట్‌ 24 గంటల్లో, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు రెండు రోజుల్లో వెలువరించేలా దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు వచ్చిన ఆయన- మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో కొవిడ్‌-19 నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు వైరస్‌ నివారణకు జిల్లాలో చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. మంత్రి మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులను అర గంటలో ఆసుపత్రిలో చేర్చుకుని పడకలు కేటాయించాలని ఆదేశించారు. నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లను త్వరితంగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ కిట్లు అయిపోతే ఎందుకు తెప్పించుకోలేదని అధికారులను ప్రశ్నించారు. నిర్ధరణ పరికరాలు ఏమైనా కావాలంటే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా జిల్లాలోని కొవిడ్‌ ఆసుపత్రుల్లో 500, కేర్‌ సెంటర్లలో 1000 వరకు పడకల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాలో 1048 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉన్నాయని, మరో 458కి టెండర్లు పూర్తయ్యాయన్నారు. నెల రోజుల్లో మొత్తం 1506 అందుబాటులో ఉంటాయన్నారు. మందుల నిల్వ వివరాలనూ అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వాటిని పంపిణీ చేయడంలో అలసత్వం తగదని హెచ్చరించారు. పోస్టుల భర్తీపైనా సూచనలు చేశారు. కరోనా బాధితులతో నిర్వహించిన వీక్షణ సమావేశంలో భోజనం నాణ్యత సరిగా లేదన్న విమర్శలు వస్తున్నాయని, దాన్ని సరిదిద్దుకోవాలన్నారు. ప్రసూతీ సేవలకు ఎక్కడా విఘాతం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను త్వరితంగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాస్మా దానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.