ఎస్సారెస్పీకి 33,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
eenadu telugu news
Published : 21/10/2021 06:08 IST

ఎస్సారెస్పీకి 33,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

శ్రీరాంసాగర్‌, న్యూస్‌టుడే: శ్రీరాంసాగర్‌ జలాశయానికి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 33,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల మేరకు నీటి నిల్వ ఉంచి వచ్చిన వరదను వచ్చినట్లు గోదావరిలోకి వదిలేస్తున్నారు. ఏడు గేట్ల ద్వారా 24,960, ఎస్కేప్‌ గేట్ల నుంచి 7500, సరస్వతీ కాల్వకు 800, లక్ష్మికి 80, మిషన్‌ భగీరథకు క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 90.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో ప్రధాన వరద గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్‌ తెలిపారు. బుధవారం సాయంత్రానికి 6,300 క్యూసెక్కుల వరద రాగా జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 2400 క్యూసెక్కులను మంజీరలోకి విడుదల చేసినట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని