తగ్గుతూ...పెరుగుతూ...
logo
Published : 17/05/2021 04:57 IST

తగ్గుతూ...పెరుగుతూ...

మరో 1,509 కేసుల నమోదు


ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నమూనాలు సేకరిస్తున్న సిబ్బంది

గుజరాతీపేట(శ్రీకాకుళం), శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గత వారం రోజులుగా కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతూ పెరుగుతూ నమోదవుతున్నాయి. ఆదివారం మరో 1,509 కేసులను గుర్తించారు. చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుగుణంగా గణాంకాల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆదివారం నాటికి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 1901 మందికి చికిత్స పొందుతున్నారు. 1,939 కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 10,392 మంది హోం ఐసోలేషన్‌లో, 778 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేసీ చంద్రనాయక్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని చెప్పలేమన్నారు.ఇలాంటి సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో ఉన్నా మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అర్హులందరూ టీకా వేయించుకోవాలని చెప్పారు. జ్వరం, ఏ ఇతర లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. అందరి సహకారంతోనే మహమ్మారి కట్టడి సాధ్యమని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని