టీకా రెండో డోసుపై దృష్టి సారించండి: జేసీ
eenadu telugu news
Published : 19/09/2021 05:07 IST

టీకా రెండో డోసుపై దృష్టి సారించండి: జేసీ


దూరదృశ్య సమావేశంలో పాల్గొన్న జేసీ కె.శ్రీనివాసులు, ఇతర అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పక్కాగా నిర్వహించాలని, రెండో డోసుపై దృష్టి సారించి కచ్చితంగా వేయాలని మున్సిపల్‌ కమిషనర్లను జేసీ కె.శ్రీనివాసులు ఆదేశించారు. దిల్లీ నుంచి వ్యాక్సినేషన్‌పై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కార్యదర్శి రాజీవ్‌గౌబ శనివారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి జేసీ ఇందులో పాల్గొన్నారు. కొవిడ్‌-19 మూడో దశను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని రాజీవ్‌ సూచించారు. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ నిల్వలు చూసుకోవాలని చెప్పారు. అనంతరం జేసీ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌, కమిషనర్లు ఓబులేసు, రమేశ్‌, సుధాకర్‌, రాజగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని