రేషన్‌ డీలర్ల ఆందోళన బాట
eenadu telugu news
Published : 26/10/2021 04:11 IST

రేషన్‌ డీలర్ల ఆందోళన బాట

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రేషన్‌ డీలర్లు ఆందోళన బాట పట్టారు. పౌరసరఫరాలశాఖ అధికారుల తీరును నిరసిస్తూ రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లాలో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు డిపోలకు రేషన్‌ సరకుల సరఫరా నిలిపివేయనున్నారు. జిల్లాలో 2015 మంది డీలర్లు ఇందులో పాల్గొంటున్నారు. నవంబరు నెల రేషన్‌ సరఫరా చేయాలంటే 26వ తేదీ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డిపోలకు సరకులు రవాణా జరగాలి. తమ సమస్య పరిష్కారమైన తరవాతే సరకులు తీసుకుంటామని వారంతా చెబుతున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా గోనెసంచుల ద్వారా ఒక్కొక్కరికీ నెలకు రూ.3 వేల వరకు అదనపు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం వీటిని తమకే అప్పగించాలని అధికారులు ఆదేశించారు. తమకు వచ్చే ఈ కొద్డిపాటి ఆదాయం కూడా రాకుండా అడ్డంకులు వేయడం తగదని జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎస్‌.సూర్యారావు అంటున్నారు. రెండు రోజుల పాటు సరకులను విడిపించకుండా నిరాకరిస్తారని, కమిషనర్‌ హామీ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని