‘కౌన్సిల్‌’లో సీట్లు మార్చేస్తారా..!
eenadu telugu news
Published : 31/07/2021 03:47 IST

‘కౌన్సిల్‌’లో సీట్లు మార్చేస్తారా..!

తెదేపా కార్పొరేటర్ల ఆగ్రహం

మార్చిన సీట్లను పరిశీలిస్తున్న తెదేపా కార్పొరేటర్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు వైకాపా నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. ద్వితీయ ఉప మేయరు ఎన్నిక సందర్భంగా కౌన్సిల్‌ సమావేశ మందిరంలో సీట్లను మార్చడాన్ని గుర్తించిన తెదేపా కార్పొరేటర్లు జీవీఎంసీ కార్యదర్శి ఎస్‌ఎస్‌ లావణ్యను ప్రశ్నించారు. ఫ్లోర్‌ లీడర్‌ సీటుకు కనీస మర్యాద ఇవ్వకపోవడం సరికాదన్నారు. ద్వితీయ ఉప మేయర్‌ ఎన్నిక సందర్భంగా నిబంధనల మేరకు సీట్లలో మార్పు చేసామని కార్యదర్శి చెప్పగా, సంబంధిత ఉత్తర్వులు చూపాలని కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు నిలదీశారు. పేర్ల ప్రకారం మార్పులు చేశామని తెలియజేయగా, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేశారు.

* స్థాయీ సంఘం ఎన్నికల్లో వైకాపా సభ్యులకు ఓట్లేసిన తెదేపా కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ, గంటా అప్పలకొండ, కాకి గోవిందరెడ్డి సీట్లలో మార్పులు చేశారు. తెదేపా వరుసలో వెనుక, వైకాపా వరుస ప్రారంభానికి ముందు వారి సీట్లు ఏర్పాటు చేశారు. గతంలో తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సీట్ల తరువాత వరుసలో వారు ఉండేవారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని