55 కొవిడ్‌ కేసులు నమోదు
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

55 కొవిడ్‌ కేసులు నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 55 కొవిడ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 1,56,616కు చేరిందన్నారు. తాజాగా 68 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,54,486 మంది డిశ్ఛార్జి అయ్యారన్నారు. దువ్వాడకు చెందిన 74ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌తో మృతి చెందగా, మృతుల సంఖ్య 1,082కు చేరిందన్నారు. ప్రస్తుతం 1,048 మంది ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని