28 నుంచి జాతీయస్థాయి గోల్ఫ్‌ పోటీలు
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

28 నుంచి జాతీయస్థాయి గోల్ఫ్‌ పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయస్థాయి అమెచ్యూర్‌ గోల్ఫ్‌ పోటీలు ఈనెల 28 నుంచి విశాఖ ముడసర్లోవలోని ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కోర్సులో జరగనున్నాయి. రాష్ట్రం తొలిసారిగా ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇండియన్‌ గోల్ఫ్‌ యూనియన్‌ (ఐజీయూ ) ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. పోటీల్లో తలపడేందుకు పలువురు ప్రముఖ క్రీడాకారులు రానున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని