close

శనివారం, జులై 20, 2019

ప్రధానాంశాలు

అక్కడ రెండు హెల్మెట్లు కొంటేనే.. బండి!

మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ వినూత్న నిర్ణయం
నగరంలో నెలకు 2.80 లక్షల కేసుల నమోదు
 మనవద్ద కూడా మార్పు అవసరమంటున్న నిపుణులు
ఇదీ లెక్క....

* నగరంలో వాహనాల సంఖ్య- 50 లక్షలు
* ద్విచక్ర వాహనాలు- 80 శాతం
* నిత్యం రోడ్లపైకి వస్తున్న
కొత్త వాహనాలు-  2000
* నగరంలో ఏటా 600 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
* చనిపోతున్న వారిలో తలకు గాయాలు తగిలిన వారు- 75 శాతం

ఈనాడు, హైదరాబాద్‌

అక్కడ ద్విచక్ర వాహనం ముచ్చట తీరాలంటే.. అంతకు ముందు రెండు శిరస్త్రాణాలు (హెల్మెట్లు) కొనుగోలు చేయాలి. ఆ బిల్లును చూపిస్తే మాత్రమే మీరు ద్విచక్ర వాహనం కొనేందుకు అర్హులు. అది కూడా అల్లాటప్పా హెల్మెట్‌ కాదు. తప్పనిసరిగా ఐఎస్‌ఐ గుర్తు ఉన్నవి మాత్రమే కొనాలి. లేదంటే ఉత్తి చేతులతో వెనుదిరగాల్సిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో రవాణాశాఖ ఈ నిబంధనల తేవడంతో అక్కడ ప్రజల నుంచి ప్రసంశలు అందుతున్నాయి. మరి హైదరాబాద్‌ సంగతి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... అయితే వాహనదారులు నిర్లక్ష్యం చూస్తే... ఇక్కడ కూడా అదే తరహా నిబంధనల అవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు హెల్మెట్ల లేకుండా వాహనాలు నడుపుతున్న దాదాపు 11.17 లక్షల మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే సరాసరి నెలకు 2.80 లక్షలు కేసులు పెడుతున్నారు. ఈ సంఖ్య చాలు.. నగరంలో వాహనదారుల నిర్లక్ష్యం తేటతెల్లం చేస్తుంది. ఎన్ని కేసులు పెడుతున్న సరే.. ఎలాంటి మార్పు కన్పించడం లేదు. చాలామంది హెల్మెట్లు పెట్టుకోకుండానే వాహనాలను నడిపేస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనం నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. వెనుక కూర్చొన్న వారు కూడా హెల్మెట్లు ధరించాలి. నగరంలో ఒక్కరు ధరించడమే కష్టమవుతోంది. మధ్యప్రదేశ్‌ మాత్రం వాహనం నడిపే వారే కాదు.. వెనుక కూర్చొన వ్యక్తికి కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. ఇదే తరహాలో ఇక్కడా హెల్మెట్లు కొంటనేనే బండి అమ్మే విధంగా చర్యలు తీసుకుంటే కొంత మార్పు వస్తుందని భావిస్తున్నారు.

ఆషామాషీగా వద్దు...
ఆషామాషీగా హెల్మెట్‌ ధరించడం వల్ల కూడా గాయాల పాలవుతున్నవారు ఎక్కువ మందే ఉంటున్నారు. శిరస్త్రాణం పెట్టుకున్నా సరే... మెడ కింద బెల్టు సక్రమంగా పెట్టుకోక పోవడంతో ప్రమాదాల సమయాల్లో హెల్మెట్‌ పక్కకు ఎగిరిపోయి తలకు గాయాలు తగులుతున్నాయి. సక్రమంగా శిరస్త్రాణం ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే.. మంచి కంపెనీతోపాటు ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్లు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక హెల్మెట్‌ ధరించడం వల్ల జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు అంటున్నారు. నగరంలో వాహన కాలుష్యం ఎక్కువగా ఉంది. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.  ఈ నేపథ్యంలో శిరస్త్రాణధారణ కాలుష్యం..ఎండ నుంచి కళ్లు, ముఖాన్ని కాపాడుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
బలమైన గాయాల నుంచి రక్షణ...
హెల్మెట్‌ ధరించకపోతే ఏమవుతుంది? ఇదే చాలామందిలో ఉన్న సందేహం. బైక్‌ నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కింద పడితే తలకు బలమైన గాయం కాకుండా పూర్తి రక్షణ కల్పిస్తుంది. సాధారణంగా తలకు గాయమైనప్పుడు కొద్ది సెకన్ల పాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మాసకబారటం, చెరువులో హోరున శబ్దం, రుచి తెలియక పోవడం, బాగా అలసటగా ఉన్నట్లు అన్పిపించడం, నిద్రవేళల్లో, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కన్పిస్తాయి. తీవ్ర గాయాలైనప్పుడు తలనొప్పి తగ్గకుండా వేధించడం, మాటిమాటికి వాంతులు, వికారం, పిట్స్‌, మాట ముద్దగా రావటం, ఏదైనా అవయ వంలో బలహీనత లేదా తిమ్మర్లు, ఆలోచనలకు చేతులకు సమన్వయం లోపించడం, తీవ్రమైన అయోమయం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కొన్నిసార్లు బయటకి గాయం కన్పించక పోయిన రోడ్డు ప్రమాదంలో తల అదిరిపడినప్పుడు లోపల గాయమవుతుంది. పుర్రె గోడలకు మెదడు కొట్టుకుంటుంది. దీనివల్ల మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని హిమటోమాకు దారితీస్తుంది. హెల్మెట్‌ ఉంటే తలకు ఇలాంటి తీవ్రమైన గాయాలు తగలకుండా బయటపడే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలంటే మధ్యప్రదేశ్‌ మారిది ఇక్కడ హెల్మెట్‌ తప్పనిసరి చేయాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.