close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

వారు.. వీరు.. తవ్వలేరు

అత్యుత్తమ ప్రమాణాలతో నగర రహదారుల నిర్వహణ
పదే పదే టెండర్లు పిలిచే విధానానికి స్వస్తి
సీఆర్‌ఎం కింద 709 కిలోమీటర్లు చేపట్టేందుకు కసరత్తు
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

రోడ్ల నిర్వహణలో దీర్ఘకాలికంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ వినూత్న కసరత్తు చేపట్టింది. కాంప్రిహెన్సివ్‌ రోడ్‌ మెయిన్‌టెనెన్స్‌ (సీఆర్‌ఎం)పేరుతో నగరంలోని ప్రధాన రోడ్ల నిర్వహణను చేపట్టనుంది. ఇప్పటి వరకు రోడ్ల నిర్వహణతోపాటు ఫుట్‌పాత్‌ నిర్మాణాలను వేర్వేరుగా నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇక నుంచి రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ నిర్వహణ, రోడ్ల పరిశుభ్రత, పచ్చదనం నిర్వహణ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్నింటినీ ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలు రూపొందిస్తోంది. సుమారు ఐదు సంవత్సరాలపాటు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది.

సమన్వయం లోపం అధిగమించేందుకు..
ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ రోడ్ల నిర్వహణ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పుతూ వస్తోంది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చడం, నూతనంగా లేయర్‌ రోడ్లను వేయడం వంటి కార్యక్రమాలకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారు. ఈ విధానంలో వర్కింగ్‌ ఏజెన్సీల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు పాడైన రోడ్లను గుర్తించడం, వాటి నిర్వహణ అంచనాలు తయారు చేయడం, టెండర్లు పిలవడం వంటి వివిధ ప్రక్రియలకు ఎక్కువ సమయం పడుతున్నది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులను గుర్తించి వాటి నిర్వహణ నిమిత్తం ఐదు సంవత్సరాల కోసం టెండర్లు పిలవాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన ప్రమాణాల మేరకు రోడ్లను నిర్వహించాల్సి ఉంటుంది. రోడ్డు గుంతలతోపాటు, అవసరం అయిప్పుడు నూతనంగా రోడ్లు వేయడం తదితరాలను అయా సంస్థలే చేపట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు మీడియన్ల గ్రీనరీ, రోడ్ల పరిశుభ్రత, పాదబాట నిర్మాణం, నిర్వహణ పూర్తి బాధ్యత వర్కింగ్‌ ఏజెన్సీలదే. దీంతోపాటు ఈ 5 సంవత్సరాలపాటు ట్రాన్స్‌ కో, జలమండలి, ప్రైవేటు సంస్థలు మాస్టర్‌ ప్లాన్‌ విస్తరణ వంటి అవసరాలకు రోడ్లు తవ్వేందుకు వర్కింగ్‌ ఏజెన్సీలే సహకరిస్తాయి. అయితే అయా సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నూతనంగా వేసిన రోడ్లను, ఫుట్‌పాత్‌లను వెంటనే తవ్వే అవసరం ఉండదు. దీంతోపాటు ఎప్పుడైన రోడ్లను తవ్వితే వాటినే వెంటనే పూడ్చి, తిరిగి యథాతథ స్థితికి తేవడంలోనూ ప్రస్తుతం వివిధ శాఖల మధ్య ఉన్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు.

రహదారుల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ..
సీఆర్‌ఎం కార్యక్రమం కింద 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజించి దీర్ఘకాలిక టెండర్లను జీహెచ్‌ఎంసీ పిలవనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ సిబ్బంది, జోనల్‌ కమీషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సీఆర్‌ఎం కార్యక్రమంతో వాటిని నిర్వహించనున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్వహణతోపాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలను నిర్దేశించినట్లు, ఆయా వర్కింగ్‌ ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సమావేశంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కూమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.