close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

ప్రధానాంశాలు

మత్స్య కేంద్రం..సమస్యలతో సతమతం

వేధిస్తున్న సిబ్బంది కొరత


నిరుపయోగంగా కార్యాలయ కొత్త భవనం

బాదంపూడి (ఉంగుటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని బాదంపూడి మత్స్య కేంద్రం ప్రత్యేకమైనది. విశాలమైన ప్రాంగణం, చేపనారు ఉత్పత్తికి అనువైన చెరువులు ఉన్నాయి. చేప పిల్లల ఉత్పత్తిపై శిక్షణ కూడా ఇస్తారు. గతంలో రూ.1.50 లక్షలు వెచ్చించి, కేంద్రాన్ని ఆధునికీకరించారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఈ కేంద్రం చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం బాదంపూడి మత్స్య కేంద్రాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. వనరులున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సిబ్బంది కొరత వేధిస్తుంది. ఈ కేంద్రం చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో పలువురు చెరువుల్లోని చేపలను వలలతో పట్టుకుని తీసుకుపోతున్నారు. కనీసం 13 మంది ఉద్యోగులు కేంద్రంలో పని చేయాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. లక్ష్యాలను అధిగమించడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మత్స్య కేంద్ర కార్యాలయం నిరుపయోగంగా ఉంది. శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే నేటికీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. భవనంపై కప్పు పెచ్చులూడిపోయి ప్రమాదకరంగా ఉంది. ఇటీవల మత్స్యకేంద్రం సహాయ సంచాలకుడు కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా పైకప్పు పెచ్చులు ఊడి ఆయనపై పడటంతో గాయపడ్డారు.

మత్స్య కేంద్రంలో ఏడీ, ఎఫ్‌డీవో, ఫీల్డ్‌మ్యాన్‌-2, ఫిషర్‌ మ్యాన్‌-6, వాచ్‌మెన్‌-2, ఒక అటెండర్‌ మొత్తం కలిపి 13 మంది ఉండాలి. ప్రస్తుతం ఏడీ, ఎఫ్‌డీవో, ఒక ఫీల్డ్‌మ్యాన్‌ మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో నాలుగు సంవత్సరాలుగా లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు.

రూ.25 లక్షలతో నిర్మించిన కేంద్ర కార్యాలయ నూతన భవనం నిరుపయోగంగా ఉంది. భవన నిర్మాణంలో నాణ్యతలేదని, రెండో అంతస్తు ఒక పక్కకు ఒరిగి పోయిందని సిబ్బంది వాపోతున్నారు.

సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

కేంద్రంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సిబ్బంది లేకపోవడంతో రోజువారీ కూలీలతో పనులు చేయిస్తున్నాం. - వెంకటేశ్వరరావు, ఎఫ్‌డీవో

పెచ్చులూడిన పాత కార్యాలయం పైకప్పు
 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.