close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

ఎన్ఆర్ఐ

అమ్మాయిలకు... ఆత్మరక్షణ విద్యలు నేర్పించండి 

పిల్లలకు విలువలు, బంధాల గురించి చెప్పండి
హీరో సాయిధరమ్‌ తేజ్‌
ప్రతి రోజూ పండగే చిత్ర ప్రచారం ప్రారంభం 
ఈనాడు, విశాఖపట్నం

ప్రతి రోజూ పండగే చిత్ర బృందం శనివారం విశాఖలో సందడి చేసింది. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. బంధుత్వాల విలువను తెలియజేసే కథాంశంతో నిర్మించామని చిత్ర బృందం తెలియజేసింది. నగరంలోని ఓ థియేటర్‌లో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడింది. అనంతరం హీరో సాయిధరమ్‌తేజ్‌ తెలియజేసిన వివరాలు...


తల్లిదండ్రులదే బాధ్యత...
దిశ ఘటన నేపథ్యంలో మహిళల ఆత్మరక్షణకు సంబంధిత విద్య తెలుసుండాలి. వీటిపై తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించాలి. ఇవన్నీ బాల్యంలోనే చేయాలి. ఆ దిశగా ప్రతిఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా బయటపడాలో తెలుసుకునేందుకు యాప్స్‌ వినియోగించుకోవాలి.


తాతగారే గుర్తొచ్చారు..
దర్శకుడు కథ వినిపిస్తున్నపుడే తాత గుర్తొచ్చారు. ఆయనతో పెరిగిన రోజులు నా కళ్లముందుకు సాక్షాత్కరించాయి. మంచి కుటుంబ కథాచిత్రం అవ్వడంతో కథ విన్న వెంటనే ఒకే చెప్పా. ఇక తాత పాత్రలో సత్యరాజ్‌తో నటించినంత సేపు భలే సరదా అనిపించింది. నిజజీవిత దృశ్యాలను స్పృశించేలా సాగింది. తాతామనమడి మధ్య బలమైన బంధం వ్యక్తిగతంగానూ గొప్ప ఆనందాన్ని కలిగించింది.


విలువల గురించి..
పిల్లలకు విలువలు, గౌరవ మర్యాదల గురించి తెలియజేయాలి. చదువుకుంటేనే తెలుస్తాయనుకోవడం పొరపాటు. దిశపై అత్యాచారం చేసి, చంపిన నిందితులంతా పెద్దవయస్కులేమీ కాదు. విలువలతో కూడిన జ్ఞానం లేకపోవడమే వారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు పిల్లలకు మంచి చెడుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మగ, ఆడపిల్లలిద్దర్నీ సమానంగా పెంచాలి.


అభిమానులతో..
చాలా రోజుల తరువాత అభిమానులను కలుసుకునే అవకాశం దక్కింది. వారుంటేనే మేమున్నాం. వారు చూపించే అభిమానమే ఈ స్థాయిలో ఉంచింది. ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన సినిమా ఇది. సీనియర్‌ నటులతో నటించడం ఆనందాన్నిచ్చింది.


మంచి కథ వస్తే
మంచి కథ ఉంటే మల్టీ స్టార్‌ సినిమాలు చేయడానికి సిద్ధమే. ఆ తరహా చిత్రాలు చేయాలన్న ఆసక్తి ఉంది. మెగాఫ్యామిలీ సభ్యులతో చేయడానికి సరిపడా కథలుండాలి.

కనకమహాలక్ష్మి సన్నిధిలో సాయిధరమ్‌తేజ్‌

అమ్మవారి ఆలయంలో సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ 

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కనకమహాలక్ష్మి అమ్మవారిని సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఏఈఓ వి.రాంబాబు ఆధ్వర్యంలో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. ఏఈఓ రాంబాబు ఆయనకు ప్రసాదాలు అందజేశారు.

 


మంచి సినిమా...
- దర్శకుడు మారుతి

ఎవరైనా సినిమా విడుదలై, విజయవంతమైతేనే ప్రచారం నిర్వహిస్తారు. మా చిత్ర బృందం విడుదలకు ముందే ప్రారంభించింది. మంచి కుటుంబ కథ అవ్వడంతో ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ ప్రచారం ప్రారంభించాం. ముందుగా విశాఖ నుంచి మొదలుపెట్టి రాజమహేంద్రవరం, గుంటూరు, ఏలూరు విజయవాడ మధ్యలో మరికొన్ని ప్రాంతాలకు వెళ్తాం. ట్రైలర్‌కు అభిమానుల నుంచి గొప్ప స్పందన వస్తోంది. పాటలు బాగున్నాయి. సత్యరాజ్, రావు రమేష్‌ నటన ఆకట్టుకుంటుంది. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.