close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పక్కాగా గుర్తించాలి.. పరీక్షలు చేయాలి

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్టు ట్రేసింగ్‌ను గుర్తింపు కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్‌-19 నివారణ చర్యలపై కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాలులో సోమవారం అధికారులతో సమీక్షించారు. జులై 10 నుంచి గుంటూరు నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని, వీటితో పాటు మరణాల సంఖ్య పెరిగిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వార్డు సచివాలయాల వారీగా ఏర్పాటు చేసిన సర్వైలెన్స్‌ బృందాల్లోని సభ్యులు ఆయా ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసు నమోదైన వెంటనే ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనుమానిత లక్షణాలున్న వారికి, హైరిస్క్‌ కేటగిరికి చెందిన వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. నోడల్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల సన్నిహితంగా మెలిగిన వారి గుర్తింపు సక్రమంగా జరగటం లేదన్నారు. ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న నల్లచెరువు, శ్రీనివాసరావుతోట, ముత్యాలరెడ్డినగర్‌, వేళంగిణినగర్‌, ఎన్జీవో కాలనీ వంటి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో సర్వైలెన్స్‌, పరీక్షలు, కంటెయిన్‌మెంట్‌ స్ట్రాటజీని కఠినంగా అమలు చేయాలన్నారు. వేళంగిణినగర్‌లో ప్రైమరీ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పట్ల కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. వందకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైతే 205 మందినే ప్రైమరీ కాంటాక్టుగా అధికారులు గుర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పోస్టర్లపై వ్యక్తిగత ప్రచార పోస్టర్లు అతికించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పట్టణ ప్రణాళిక విభాగ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌వోను ఆదేశించారు. జేసీ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ మాట్లాడారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ యాస్మిన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాధ, డీఆర్‌వో ఎన్‌.వి.వి.సత్యనారాయణ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.